మెగాస్టార్ తో సంచలన దర్శకుడు.. నిజమేనా ?

Published on May 10, 2021 9:00 pm IST

మెగాస్టార్ ఎప్పుడైతే రీఎంట్రీ ఇస్తున్నా అని ఎనౌన్స్ చేశాడో.. అప్పటి నుండి ప్రతి దర్శకుడు చిరు కోసం కథలు రాయడం స్టార్ట్ చేశారు. దీనికితోడు మెగాస్టార్ కూడా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ వెళ్తున్నాడు. అందుకే చాలామంది డైరెక్టర్లు మెగాస్టార్ కి కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ కూడా చిరు కోసం మంచి కథ రాశాడట.

కాగా చిరు బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా తానూ సినిమా చేస్తానని.. చిరుకి కథ చెప్పడానికి అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నాడట. మెగాస్టార్ ఒక్క ఛాన్స్ ఇస్తే మాత్రం మరో వైవిధ్యమైన సినిమాతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఎలాగూ అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపాడు అనుకోవాలి. అప్పట్లో శివ సినిమా ఎలాగో.. ఈ జనరేషన్ లో అర్జున్ రెడ్డి సినిమా అలాగా. మరి అలాంటి దర్శకుడు చిరుతో సినిమా చేస్తే ఓ రేంజ్ లో ఉంటుంది.

సంబంధిత సమాచారం :