‘అర్జున్ రెడ్డి’ టైటిల్ ఆ డైరెక్టర్ కొడుకుకి పేరుగా పెట్టాడంట…!

Published on Jun 5, 2019 12:56 pm IST

వంగా సందీప్ రెడ్డి దర్శకుడిగా చేసింది ఒక సినిమా సంపాదించిన క్రేజ్ మాట్లల్లో చెప్పలేము. దశాబ్దాలుగా పదుల సంఖ్యలో సినిమాలు చేసిన దర్శకులకు కూడా రాని క్రేజ్ “అర్జున్ రెడ్డి” అనే ఒక్క బ్లాక్ బస్టర్ తో ఈయన సంపాదించారు.అలాగే విజయ్ దేవరకొండకి యూత్ లో విపరీతమైన పాపులారిని తెచ్చిపెట్టింది “అర్జున్ రెడ్డి” మూవీ. ఈ మూవీ తమిళ అనువాదంలో స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ చేస్తుండగా, హిందీలో షాహిద్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ గా సందీప్ రెడ్డి వంగా స్వయంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ఈ నెల 21వ తేదీన బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ .. ‘అర్జున్ రెడ్డి’ అనే సినిమాను నేను ఓ యజ్ఞంలా భావించి నా ప్రాణం పెట్టి చేశాను. ఈ నా ప్రయత్నంలో నిర్మాతలు,కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది . అందుకే నా కొడుకుకి ‘అర్జున్ రెడ్డి’ అనే పేరు పెట్టుకున్నాను. ఆ సినిమా అంటే నాకు ఎంత ఇష్టమనేది ఇప్పుడు మీకు అర్థమైపోయుంటుంది. ‘కబీర్ సింగ్’ కూడా అందరికి నచ్చి మంచి విజయం సాదిస్తుందని అని అన్నారు. ‘కబీర్ సింగ్’ చిత్రంలో షాహిద్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.

సంబంధిత సమాచారం :

More