“రాపో19” సెట్స్ లోకి అడుగుపెట్టిన డైరెక్టర్ శంకర్

Published on Jul 14, 2021 10:12 pm IST

రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #RAPO19 వర్కింగ్ టైటిల్ గా చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సమయం లో ప్రముఖ దర్శకుడు శంకర్ విచ్చేశారు. అయితే చిత్ర యూనిట్ తో శంకర్ సంభాషించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే రామ్ పోతినేనీ తో పాటుగా హీరోయిన్ కృతి శెట్టి మరియు నదియా ల పై దర్శకుడు చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే మరొక పక్క శంకర్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ను ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :