నల్లమల అడవుల్ని కాపాడాలి – శేఖర్ కమ్ముల

Published on Aug 27, 2019 8:55 pm IST

బలమైన కథలతో సెన్సిబుల్ గా సినిమాలు తీస్తాడనే మంచి పేరు ఉంది శేఖర్ కమ్ములకి. కాగా ఫిదా తర్వాత నాగచైతన్య – సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా పెట్టి మొత్తానికి క్రేజీ కాంబినేషన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ కూడా చేస్తున్నారు నెటిజన్లు.

కాగా తాజాగా సినీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. దాంతో కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్‌ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యవారణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :