దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం.

Published on Aug 1, 2020 11:54 am IST

దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శేఖర్ కమ్ముల తండ్రిగారైన శేషయ్య కమ్ముల మరణించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శేషయ్యగారిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. నేడు ఉదయం ఆయన ఆసుపత్రిలోనే మరణించినట్లు తెలుస్తుంది.

కమ్ముల శేషయ్యగారి వయసు 89 సంవత్సరాలుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న చిత్ర పరిశ్రమ ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఇక శేషయ్యగారి అంత్యక్రియలు నేడు బన్సీలాల్ పేటలో శ్మశానవాటిలో జరగనున్నాయి.

సంబంధిత సమాచారం :