రెండు గంటలు హ్యాపీగా ఎంజాయ్ చెసే సినిమా “బ్రాందీ డైరీస్” – డైరెక్టర్ శివుడు

రెండు గంటలు హ్యాపీగా ఎంజాయ్ చెసే సినిమా “బ్రాందీ డైరీస్” – డైరెక్టర్ శివుడు

Published on Aug 11, 2021 11:00 AM IST


కలెక్టివ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రాందీ డైరీస్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణతో, సహజమైన సంఘటనలు, సంభాషణలు, పరిణతి వున్న పాత్రలతో కొత్త నటీనటులతో నాచురల్ లోకేషన్స్ లో, సహజత్వానికి పట్టం కడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ, తన సొంత ఊరు గుంటూరు జిల్లా చిలకలూరిపేట దగ్గర తిమ్మాపురం అంటూ చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి అని, బాగా చదువుకున్నా అని అన్నారు. సివిల్స్ కి కూడా ప్రిపేర్ అయిన విషయాన్ని వెల్లడించారు. కానీ సినిమా పరిశ్రమలోకి రావాలి అనే తపన బలంగా ఉండటం తో ప్రతిరోజూ ఏదొక సినిమా చూసేవాడిని అని అన్నారు. సినిమా పుస్తకాలు చదివే వాడిని అని, అసిస్టెంట్ కమీషనర్ అఫ్ టాక్స్ ఆఫీసర్ గా పని చేశాననీ తెలిపారు. సినిమా కథలు రాసుకోవటానికి సమయం సరిపోవటం లేదు అని ఆ ఉద్యోగం మానేసి జూనియర్ లెక్చరర్ గా హిస్టరీ పాఠాలు చెబుతూ, సినిమాలోకంలో ఉండే వాడినని అన్నారు. హిస్టరీ పాఠాలు సినిమాటిక్ గా చెప్పేవాడినని, అలా కొత్త కొత్త ఆలోచనలు వచ్చేసేవని, ఇలా తన జీవితంలోకి ఆల్కహాల్ కూడా వచ్చిందని అన్నారు. బాగా బానిస అయిపోయానని, మళ్ళి ఇప్పుడిపుడే కోలుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు.

ఈ రోజుల్లో సినిమా తీసి మెప్పిచడం చాలా కష్టం అని అన్నారు. ప్రపంచంలో అన్ని భాషల సినిమాలు ఇప్పుడు ఓటిటి ద్వారా చూడొచ్చు, ఎన్నో కొత్త కథలు వస్తున్నాయి, మనం చూస్తున్నామని అన్నారు. తను కూడా కొత్తగా సినిమా చేయాలని, అది ప్రతి ప్రేక్షకుడికి టచ్ అవ్వాలని, ఈ బ్రాందీ డైరీస్ సినిమా కథ రాసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం అంత ఆల్కహాల్ చుట్టు తిరుగుతుందని, ఇలాంటి కథ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది అని ఈ సినిమా చేసినట్లు తెలిపారు.

తను ఆల్కహాల్ మంచిదా లేదా చెడ్డదా అని చెప్పలేదు, కానీ ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గురించి చెప్పా అని అన్నారు. చాలా మందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయని, కొందరు ప్రతి రోజూ పానీపూరీ తింటారు, అది కూడా అలవాటు లాంటిదే అని అన్నారు. ఇలా రకరకాల వారికి రకరకాల అలవాట్లు ఉంటాయని, మరి ఇన్ని అలవాట్లు ఉంటే ఆల్కహాల్ ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారని అన్నారు. ఆల్కహాల్ అతి ప్రాచీన కాలంనాటి నుంచి ఉన్న అలవాటే అని హిందూ పురాణాల్లో ఉందని అన్నారు. బైబిల్ లో కూడా బ్రెడ్, వైన్ తాగే సంప్రదాయం ఉందని చెప్పుకొచ్చారు. ప్రాచీనకాలం నుంచి ఉన్న సంస్కృతిని ఇప్పుడు నీచంగా చూస్తున్నారని, రెగ్యులర్ గా మన తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్ వదిలేసింది అనే భాదతో ఆల్కహాల్ తాగుతాడు, లేదా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటారు, అలా ఒకటో రెండో సీన్ లు ఉన్నాయి అని తెలిపారు. కానీ తన సినిమాలో మొత్తం ఆల్కహాల్ మీదే నడుస్తుంది. సినిమాటిక్ గా మంచి కమర్షియల్ సీన్స్ తో చిత్రీకరించాము అని అన్నారు.

బ్రాందీ డైరీస్ టైటిల్ కథ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. ఇది పూర్తిగా వినోద భరితమైన సినిమా, ఎటువంటి సందేశం కానీ లెక్చర్ కానీ లేదు, రెండు గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా అని అన్నారు. ఈ కథ వ్యసన స్వభావం ఉన్న కొంతమంది కథ అని స్పష్టం చేశారు. ఆ వ్యసనం చుట్టు అల్లుకున్న ఒక అందమైన కుటుంబ కథ అని, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయని, ఎటువంటి మెసేజ్ లేదు. ఈ చిత్రంలో ఆల్కహాలే హీరో అని అన్నారు. మిగతా వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రమే, కానీ ఆల్కహాల్ మంచి హీరోనా? చెడ్డ హీరోనా? అని తెలుసుకోవాలని ఉంటే బ్రాందీ డైరీస్ చిత్రం చూడాల్సిందే అని అన్నారు. తాగుబోతుల్ని జడ్జ్ చేయటానికి మనకి రైట్ లేదు. అసలు ఎవరిని జడ్జ్ చేయకూడదు. మంచి చెడు జడ్జ్ చేయటానికి మనం ఎవరం. నీకు మంచి అనిపించింది నాకు చెడు అనిపించొచ్చు అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు