విశ్వాసం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన దర్శకుడు !

విశ్వాసం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించిన దర్శకుడు !

Published on Dec 1, 2018 2:50 AM IST

తల అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘విశ్వాసం’ గురించి చిత్ర దర్శకుడు శివ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈచిత్రంలో అజిత్ డ్యూయెల్ రోల్లో నటిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్సిన నేపథ్యంలో దీనిపై శివ క్లారిటీ ఇచ్చాడు. అజిత్ ఈచిత్రంలో ఒకే పాత్రలో కనిపించనున్నాడని ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంత విలేజ్ లో జరుగుతుందని సెకండ్ హాఫ్ సిటీ కి షిఫ్ట్ అవుతుందని అన్నారు.అలాగే ఈ చిత్రంలో మొత్తం 5పాటలు ఉన్నాయని నయనతార ఈ చిత్రంలో నిరంజనా అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుందని తెలిపారు.

సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి లో పొంగల్ కానుకగా ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు