ఇంటర్వ్యూ : శ్రీనివాస్ రెడ్డి – “రాగల 24 గంటల్లో” చివరివరకూ ఏమి జరుగుతుందనే ఆసక్తి ఉంటుంది !

Published on Nov 16, 2019 3:10 pm IST

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంధర్భంగా శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

“రాగల 24 గంటల్లో” ఏం జరగబోతుంది ?

నేను మొదటిసారి థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేయడం జరిగింది. కేవలం మేము స్క్రిప్ట్ ను నమ్మి ఈ సినిమా చేశాము. ఖచ్చితంగా మంచి సినిమా చేశాము. చివరివరకూ తరువాత ఏమి జరుగుతుంది అనే ఆసక్తి ఉంటుంది.

 

మీరు కామెడీ సినిమాలు మంచివి చేశారు. ఎందుకు ఇప్పుడు థ్రిల్లర్ జోనర్ లో సినిమా చేయాలనుకున్నారు ?

నిజానికి మేము కామెడీ మూవీనే చెయ్యాలని రెండు స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటున్న క్రమంలో శ్రీనివాస్ అనే అయన ఈ కథ చెప్పారు. కథ బాగా నచ్చి మేము ఈ సినిమా చేశాము.

 

టైటిల్ ఆసక్తిగా పెట్టారు. కథకు టైటిల్ సంబంధం ఏమిటి ?

కథను బట్టే టైటిల్ పెట్టాము. సినిమా మొత్తం 24 గంటల చుట్టే తిరుగుతుంది. అన్ని రకాలుగా అలోచించే ఈ టైటిల్ పెట్టాము.

 

హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ?

ఆమె ఈ సినిమాకి ముందు పది సినిమాలు వరకూ చేసింది. కానీ ఈ సినిమాలో ఈషా రెబ్బ చాల అందంగా నటించింది. ఆమెకు సినిమా విడుదల తరువాత చక్కటి పేరు వస్తోంది.

 

ఈ సినిమాలో హీరోగా నటించిన సత్య దేవ్ గురించి ?

సత్యదేవ్ ఎంత మంచి ఆర్టిస్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాలో సత్యదేవ్ నట విశ్వరూపం ఏమిటో చూస్తారు.

 

ఎందుకు మీరు ‘ఢమరుకం’ తరువాత చాల గ్యాప్ తీసుకున్నారు ?

ఆ సినిమా తరువాత నాగచైతన్యతో సినిమా అనుకున్నాం. ఆ సినిమా కోసం దాదాపు పది నెలలు వర్క్ చేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.

 

మీ తదుపరి సినిమాలు గురించి ?

రెండు మూడు స్క్రిప్ట్ లు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి “రాగల 24 గంటల్లో” సినిమా విడుదల కోసంమే ఎదురుచూస్తున్నాను.

సంబంధిత సమాచారం :

X
More