దర్శకుడు శ్రీవాస్ ఇంట విషాదం

Published on Feb 23, 2020 3:00 am IST

దర్శకుడు శ్రీవాస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీవాస్ తల్లి అయిన ఓలేటి అమ్మాజి మరణించారు.ఆమె వయసు 68సంవత్సరాలు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల శ్రీవాస్ కుటుంబీకులు, బంధువులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు శ్రీవాస్ ని ఫోన్‌లో పరామర్శిస్తున్నారు.అమ్మాజికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దర్శకుడు శ్రీవాస్ అమ్మాజికి రెండో సంతానం.

ఇక దర్శకుడు శ్రీవాస్ గోపీచంద్ హీరోగా వచ్చిన ‘లక్ష్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘లౌక్యం’, ‘డిక్టేటర్’, ‘సాక్ష్యం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా శ్రీవాస్ నిర్మాత డివివి దానయ్య కుమారుడు హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాని తెరకేక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More