ఆ డైరెక్టర్ కి స్టార్ హీరోనే కావాలా..?

Published on Mar 26, 2020 8:06 am IST

సైరా చిత్రం తో మెగాస్టార్ చిరంజీవికి కెరీర్ బెస్ట్ మూవీ అందించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఆయన తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ సైరా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా ఉంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన సైరా, సురేందర్ రెడ్డికి మంచి పేరే తెచ్చిపెట్టింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ 250కోట్లు కు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ మూవీ విడుదలై దాదాపు ఆరు నెలలు అవుతుంది.

ఇప్పటికి కూడా సురేందర్ రెడ్డి మరో సినిమాను ఫైనల్ చేయలేదు. కెరీర్ బిగినింగ్ నుండి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈయన మరో స్టార్ హీరో కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలందరిని కలిసిన ఆయన ఎవరో ఒకరిని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నారట. అవకాశం లేనప్పుడైనా టూ టైర్ హీరోలతో సినిమాలు చేయొచ్చుకదా అని కొందరు అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More