క్రేజీ కాంబినేషన్.. ‘డిమోంటీ కాలనీ’ దర్శకునితో రాఘవ లారెన్స్!

క్రేజీ కాంబినేషన్.. ‘డిమోంటీ కాలనీ’ దర్శకునితో రాఘవ లారెన్స్!

Published on May 20, 2026 7:00 PM IST

మన దక్షిణాది సినిమా నుంచి వచ్చిన పలు క్రేజీ క్రేజీ హారర్ చిత్రాల్లో రాఘవ లారెన్స్ పేరు లేకుండా వాటి ప్రస్తావన అయితే ఉండదు. మరి లారెన్స్ తన దర్శకత్వంలో పలు సినిమాలు చేయడమే కాకుండా ఇతర దర్శకులతో కూడా కొన్ని హారర్ కామెడీ జానర్ సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ లో లారెన్స్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫాంటసీ సినిమా రాబోతున్నట్టు ఇపుడు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

తన ఇంట్రెస్టింగ్ హారర్ చిత్రాలు ‘డిమోంటీ కాలనీ’ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో ఇప్పుడు లారెన్స్ వర్క్ చేయనున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అనే చెప్పాలి. అలాగే ఈ చిత్రాన్ని కోలీవుడ్ నుంచి ఓ కొత్త నిర్మాణ సంస్థ నిర్మాణం గ్రాండ్ స్కేల్ లో వహించనున్నట్టు తెలుస్తుంది. మరి వీరి కలయికలో సినిమా అంటే ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు