స్టార్ హీరో ఫ్యాన్స్ పై కేసుపెట్టిన తరుణ్ భాస్కర్

Published on Jul 1, 2020 1:19 pm IST

టాలెంటడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ పై సైబర్ పోలీసులకు పిర్యాదుచేశారు .సోషల్ మీడియా వేదికగా తరుణ్ పై దాడి చేయడమే కాకుండా దుర్భాషలాడారని, బెదిరింపులకు పాల్పడ్డారని తరుణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలియజేశారు. కొద్దిరోజుల క్రితం హీరోలను ఉద్దేశించి తరుణ్ కొన్ని పోస్ట్ లు పెట్టారు. అవి తమ హీరో గురించే అని భావించిన ఫ్యాన్స్ తరుణ్ పై సోషల్ మీడియా దాడికి దిగారు.

ఇక తనపై వేధింపులకు పాల్పడిన వారి వివరాలు, ఫోన్ నంబర్లు మరియు ఆధారాలు అన్ని పోలీసులకు సబ్మిట్ చేసినట్లు ఆయన చెప్పారు. పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ డైరెక్టర్ ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే ప్రయోగాత్మక చిత్రం చేశారు. గత ఏడాది విడుదలైన మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంతో హీరో కూడా మారాడు.

సంబంధిత సమాచారం :

More