ఆ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కోసం స్పోర్ట్స్ డ్రామా సిద్ధం చేశారట.

Published on Mar 30, 2020 7:22 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కొంత కాలంగా వెంకటేష్ తో మూవీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ కూడా తరుణ్ తో మూవీ ఉంటుందని చెప్పడం జరిగింది. ఐతే తరుణ్ స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో నచ్చని వెంకటేష్ మార్పులు చేర్పులు సూచించినట్లు సమాచారం. కాగా దీనిపై డైరెక్టర్ తరుణ్ స్పష్టత ఇచ్చారు. వెంకటేష్ కొరకు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేశాను అని చెప్పిన ఆయన ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని చెప్పడం విశేషం.

వెంకటేష్ నెక్స్ట్ మూవీ తరుణ్ తో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ తమిళ చిత్రం అసురన్ తెలుగు రీమేక్ నారప్పలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుండగా షూటింగ్ చాలా వరకు పూర్తైయింది.

సంబంధిత సమాచారం :

X
More