ఆ దర్శకుడితో మహేష్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

ఆ దర్శకుడితో మహేష్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

Published on Dec 25, 2019 9:16 AM IST

mahesh 1

ఈ ఏడాది మహేష్ మహర్షి చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ స్టూడెంట్ గా బిజినెస్ మెన్ గా, రైతుగా భిన్న షేడ్స్ లో కనిపించారు. హీరోయిన్ పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో అల్లరి నరేష్ ఓ కీలక రోల్ చేశారు. ఈ మూవీ నైజాంలో రికార్డ్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం తరువాత నుండి మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి మంచి మిత్రులయ్యారు. మహర్షి మూవీ అనంతరం వరల్డ్ టూర్ వెళ్లిన మహేష్ ఫ్యామిలీ తో వంశీ పైడిపల్లి జాయిన్ అయ్యారు. వీరిద్దరూ కలిసి లండన్ లో వరల్డ్ కప్ మ్యాచ్ కూడా చూడటం జరిగింది.

ఇక మహేష్ క్రిస్మస్ వేడుకలలో కూడా వంశీ పైడిపల్లి కుటుంబం జాయిన్ అయ్యింది. అలాగే మహేష్ కూతురు సితార వంశీ పైడిపల్లి కూతురు మంచి స్నేహితులు కావడం విశేషం. వీరు కలిసి క్రిస్మస్ జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం 2020 జనవరి 11న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు