దసరా నుండి స్టార్ట్ చేస్తారట !

Published on May 11, 2021 3:00 am IST

తన గత సినిమా భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వెంకీ కుడుముల, వరుణ్ తేజ్ ను కలిసి ఓ కథ వినిపించారని.. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో వరుణ్ తేజ్ కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా వరుణ్ తేజ్ తో సినిమాని దసరా నుండి స్టార్ట్ చేయాలనే ఆలోచనలో వెంకీ ఉన్నాడట. ఇప్పటికే వరుణ్ కోసం ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని.. వరుణ్ కూడా ఫుల్ స్క్రిప్ట్ చదివాడని… స్క్రిప్ట్ వరుణ్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది.

మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ న్యూస్ బాగానే వైరల్ అవుతుంది. కాగా భీష్మ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. వెంకీ – వరుణ్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి. మరి వీరి సినిమా దసరా నుండి సెట్స్ పైకి వెళ్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :