ఈ ‘యంగ్ డైరెక్టర్’ హీరో ఎవరో ?

ఈ ‘యంగ్ డైరెక్టర్’ హీరో ఎవరో ?

Published on May 3, 2019 8:40 AM IST

నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘తుగ్లక్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల, మజ్ను చిత్రాల దర్శకుడు విరించి వర్మతో కళ్యాణ్ రామ్ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం విరించి వర్మ కళ్యాణ్ రామ్ కోసం ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేసాడట. కానీ సినిమా మాత్రం ఇప్పట్లో లేనట్లే తెలుస్తోంది.

ఇటివలే జులై నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని చూస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అవి ఉట్టి రూమర్స్ నే తేలిపోయింది. విరించి ప్రస్తుతం శర్వానంద్ కోసం ట్రై చేస్తున్నాడట. శర్వానంద్ కోసం పల్లెటూరి నేపథ్యంలో ఓ మంచి కథ రాసినట్లు తెలుస్తోంది. తన రెండో సినిమాగా నానితో మజ్ను తీసి పర్వాలేదనిపించుకున్నాడు ఈ డైరెక్టర్. మరి తన తరువాత సినిమాను ఎవరితో చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు