ప్రభాస్ పీరియాడిక్ లుక్ అదిరిపోతుందట..!

Published on Mar 30, 2020 9:02 am IST

ప్రభాస్ లేటెస్ట్ మూవీ పీరియాడిక్ లవ్ డ్రామా అన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాధా కృష్ణ సెన్సిబుల్ అండ్ మెట్యూర్డ్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ అధిక భాగం యూరప్ నేపథ్యంలో సాగనుంది. ప్రభాస్ కి జంటగా పూజ హెగ్డే నటిస్తున్న ఈ చిత్ర తాజా షెడ్యూల్ జార్జియాలో పూర్తి చేశారు. ఈ మూవీ పీరియాడిక్ లవ్ డ్రామాగా కావడంతో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది 1960ల నాటి ప్రేమ కథ కావడంతో ప్రభాస్ మరియు పూజ లుక్స్ అప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్ చేశారట దర్శకుడు. ముఖ్యంగా ప్రభాస్ లుక్ చాల వైవిధ్యంగా గత చిత్రాలలో ఎన్నడూ చూడని విధంగా ఉంటుందట. ఈ చిత్రంలో ప్రభాస్ వింటేజ్ లుక్ చాల ప్రత్యేకం అని తెలుస్తున్న సమాచారం. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తెలుగుతో పాటు, హిందీ మరియు తమిళ భాషలలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More