సందీప్ కిషన్ కోసం ఇద్దరు దర్శకులు నటులయ్యారు

Published on Jun 19, 2019 11:35 pm IST

యంగ్ హీరో సందీప్ కిషన్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను కార్తీక్ రాజు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో తెలుగు దర్శకుడు విఐ ఆనంద్, తమిళ దర్శకుడు కార్తీక్ నరేన్ నటులుగా మారిపోయారు.

అవును.. సినిమాలో వీరిద్దరూ అతిథి పాత్రలు చేశారు. వీరిలో విని ఆనంద్ గతంలో సందీప్ కిషన్ హీరోగా ‘టైగర్’ అనే సినిమా చేయగా కార్తిక్ నరేన్’నరగసూరన్’ సినిమా చేశాడు. వీరితో పాటే నటి మాళవిక మోహన్ సైతం ఇందులో ఒక గెస్ట్ రోల్ చేశారు. వీరంతా సందీప్ కిషన్ మీదున్న అభిమానంతోనే ఈ సినిమాలో నటించారు. అన్యా సింగ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :

More