ఎన్టీఆర్ ‘అరవింద’ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

ఎన్టీఆర్ ‘అరవింద’ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

Published on Oct 2, 2018 5:13 PM IST

NTR21

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మాస్ ఇమేజీకి తగ్గట్లుగా తెరకెక్కుతున్న పూర్తి యాక్షన్ చిత్రం ‘అరవింద సమేత’. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని నోవా హోటల్ లో భారీ స్థాయిలో జరుగబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వేడుకకు సంబంధించి ఓ విషయం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను నిరాశ పరుస్తోంది. ఈ వేడుకకు ప్రత్యేక అతిధులుగా ఎవరు రావట్లేదు. దానికి తోడు ఈ చిత్ర హీరోయిన్ పూజా హెగ్డే కూడా రావట్లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం పూజా హెగ్డే, జైసల్మేర్ లో జరుగుతున్న తన బాలీవుడ్ చిత్రం ‘హౌస్ ఫుల్ 4’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉంది. అందుకే ఆమె ఈవెంట్ కి రాలేకపోతున్నారట. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనతో పాటు రాయలసీమ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ కూడా హైలైట్ అవ్వనున్నాయట. కాగా ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవ్వడానికి సన్నద్ధం అవుతుంది.

తాజా వార్తలు