సెన్సార్ పూర్తి చేసుకున్న డిస్కో రాజా

Published on Jan 20, 2020 7:01 pm IST

మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కో రాజా ఈనెల 24న గ్రాండ్ గా విడుదల కానుంది. దర్శకుడు వి ఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ తీశారని సమాచారం. పోస్ట్ వార్ మెంటల్ డిజార్డర్ తో బాధపడే పేషెంట్ గా రవితేజ నటిస్తున్నారు. దర్శకుడు రవి తేజను గత చిత్రాలకు భిన్నంగా ప్రెసెంట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా విలన్ రోల్ చేస్తున్నారు.

కాగా నేడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీచేశారు. దీనితో చిత్ర యూనిట్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ ఈ మూవీలో హీరోయిస్స్ గా నటిస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు . ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు.

సంబంధిత సమాచారం :

X
More