డిస్కో రాజా థియేటర్లలో దిగేది ఎప్పుడంటే…?

Published on Aug 29, 2019 3:06 pm IST

మాస్ మహరాజా రవి తేజా నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. దర్శకుడు వి ఆనంద్ ఓ నూతన కథాంశంతో విభిన్నంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని రవితేజ ఫస్ట్ లుక్ ని వచ్చే నెల 2న వినాయక చవితి కానుకగా విడుదల చేయనున్నట్లు నిన్న ప్రకటించడం జరిగింది. కాగా ఈ చిత్ర విడుదల తేదీ కూడా ప్రకటించేశారు.

ఐతే ఏడాది డిసెంబర్ 20న డిస్కో రాజా మూవీ విడుల చేయనున్నారు.ఈ మేరకు నేడు ప్రకటించడం జరిగింది. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, తాన్యా నటిస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న పై మంచి అంచనాలే ఉన్నాయి. విజయాల పరంగా వెనుకబడిన రవితేజా కు ఈ చిత్ర విజయం చాలా అవసరం.

సంబంధిత సమాచారం :