డిస్కోరాజా షూటింగ్ కు బ్రేక్ !

డిస్కోరాజా షూటింగ్ కు బ్రేక్ !

Published on May 4, 2019 3:47 PM IST

గత ఏడాది మూడు సినిమా లతో వరుసగా పరాజయాలను చవిచూసిన మాస్ రాజా రవితేజ ఇటీవలే వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో ‘డిస్కోరాజా’ అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అయితే రవితేజ సినిమా అవుట్ ఫుట్ పట్ల అంత సంతృప్తికరంగా లేడంట. స్క్రిప్ట్ తో పూర్తిగా స్టాటిస్ఫై అయ్యే వరకు దాంట్లో మార్పులు చేయాల్సిందిగా డైరెక్టర్ ను కోరాడట. దాంతో సినిమా షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేశారు. అలాగే చిత్రానికి బడ్జెట్ ను కూడా తగ్గియాల్సిందిగా నిర్మాతకు సూచించాడట.

ఇక ఇదిలా ఉంటే రవితేజ , సంతోష్ శ్రీనివాస్ తో తేరి రీమేక్ చేయాల్సి వుంది అయితే ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ కూడా నచ్చకపోడవంతో ఈ ప్రాజెక్ట్ ను మొత్తానికే పక్కకు పెట్టేశారు. ఇక ఆసల్యం అయినా పర్వాలేదు కానీ ఈసారి ఎలాగైనా హిట్ ఇచ్చే సినిమా చేయాలని పట్టుదలతో వున్నాడట రవితేజ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు