అల్లు అర్జున్‌లాగే రవితేజ కూడా వాళ్లకు షాకిచ్చాడు

Published on Jan 19, 2020 8:00 pm IST

అమెజాన్, నెట్ ఫ్లిక్స్‌ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మూలాన సినిమాల పరిస్థతి దారుణంగా దెబ్బతింది. థియేటర్లలో సినిమా ఆడుతుండగానే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు ఆన్ లైన్లో సినిమాను ప్రసారం చేసిన సందర్భాలు అనేకం జరిగాయి. వీటి కారణంగా లోకల్ డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఓవర్సీస్ పంపిణీదారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఆలోచనలోపడిన నిర్మాతలు తమ సినిమాల్ని డిజిటల్ స్ట్రీమర్లకు అమ్మడం తగ్గించాలని నిర్ణయించుకున్నారు.

ఈ నిర్ణయాన్ని మొదటగా అవలభించింది అల్లు అర్జున్ యొక్క ‘అల వైకుంఠపురములో’ బృందం. సినిమా ఆరంభంలోనే తమ చిత్రాన్ని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి వాటిలో చూడటం కుదరదని చెప్పేశారు. వారి బాటలోనే రవితేజ యొక్క ‘డిస్కో రాజా’ టీమ్ కూడా నడుస్తోంది. తమ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మీద చూడటం వీలుకాదని, థియేటర్లలోనే చూడాలని చెప్పేశారు. దీని మూలంగా థియేటర్లలో సినిమా ఎక్కువ రోజులు నడిచి హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు మళ్లీ పాత వైభవం వచ్చే వీలుంది.

సంబంధిత సమాచారం :

X
More