డిస్కోరాజా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారట !

Published on Feb 28, 2019 10:26 pm IST


అమర్ అక్బర్ ఆంటొని షాక్ ఇవ్వడంతో కొత్త సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు మాస్ రాజా రవితేజ. తన తదుపరి చిత్రాన్ని ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ తో చేయనున్నాడు ఈ సీనియర్ హీరో. ఇటీవల ఈ చిత్రం యొక్క టైటిల్ లోగోను లాంఛ్ చేశారు. ఈ చిత్రానికి ‘డిస్కోరాజా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ సినిమా స్కిప్ట్ అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న ‘ఓ భామ’ అనే చిత్రం యొక్క స్క్రిప్ట్ ఒకే రకంగా వున్నాయట. దాంతో రవితేజ మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సిందిగా డైరెక్టర్ ను కోరాడట. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారట టీం. ఇక మార్చి 4 నుండి జరగాల్సిన ఈ చిత్రం యొక్క షూటింగ్ వాయిదాపడే అవకాశాలు వున్నాయట.

రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలు గా నటించనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :