దిశా పటానీకి పాకిస్థాన్ నుండి బెదిరింపులు ?

Published on Jan 22, 2021 3:00 am IST


‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ‘ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2,3’ వంటి చిత్రాల్లో మంచి స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. హీరో టైగర్ ష్రాఫ్ ప్రేయసిగా ఈమె మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రంలో కూడ ఈమె నటించింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అదరగొట్టే ఈమె అందానికి ఇటు సౌత్ అటు నార్త్ రెండు వైపులా మంచి ఫాలోయింగ్ ఉంది.

అలాంటి దిశాకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ప్రాణాలకే ప్రమాదమని భయపెడుతున్నారట. ఆమెకు మాత్రమే కాదు పోలీసులకు కూడ ఫోన్ చేసి దిశాను ఎవరూ కాపాడలేరు అంటూ హెచ్చరిస్తున్నారని బాలీవుడ్ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ బెదిరింపులు పాకిస్థాన్ నుండి వస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో కనుగొనే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More