ఆ నాలుగు పెద్ద చిత్రాల నైజాం హక్కులు దక్కించుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్

Published on Jul 2, 2020 10:30 am IST

డిస్ట్రిబ్యూటర్ గా పరిశ్రమలో చాలా కాలంగా కొనసాగుతున్న వరంగల్ శ్రీను టాలీవుడ్ నాలుగు పెద్ద చిత్రాల నైజాం విడుదలకు హక్కులు దక్కించుకున్నారు. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా సీటీమార్, రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా విరాటపర్వం మరియు రవితేజ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ చిత్రంతో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న శ్రీకారం మూవీ నైజాం థియరిటికల్ రైట్స్ ఆయన దక్కించుకున్నట్లు సమాచారం.

భారీ పోటీ మధ్య ఫ్యాన్సీ ధర చెల్లించి ఈ నాలుగు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ హక్కులను వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నారు. ఈ నాలుగు చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉంది. లాక్ డౌన్ అనంతరం మిగతా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయనున్నారు. థియేటర్స్ పునఃప్రారంభమైన వెంటనే ఈ చిత్రాలు విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం :

More