హీరోలకు డిస్ట్రిబ్యూటర్ల విజ్ఞప్తి

హీరోలకు డిస్ట్రిబ్యూటర్ల విజ్ఞప్తి

Published on Mar 29, 2020 1:46 PM IST

ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతబడింది. అన్నిటికంటే ముందుగా సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యాయి. ఇంకో 15 రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. థియేటర్లు పనిచేయకపోవడంతో స్వీపర్, గేట్ మెన్, ఆపరేటర్ వంటి వారికి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారిని ఆదుకోవాలని కొందరు డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు.

హీరోలందరూ తమ సినిమాలు ప్రదర్శితమయ్యే సినిమా హాళ్ళలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగులను కూడా గుర్తించాలి. ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో సహాయం అందిస్తున్న వారంతా తమ సినిమాలు ఆడే థియేటర్లలో పనిచేసేవారిని గుర్తించి సహాయం చేస్తే బాగుంటుందని అంటున్నారు. సినీ పరిశ్రమలో పనిచేసే వారిని ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ పెద్దలు ఏదోరకంగా పనిచేస్తున్నారు. అలాగే థియేటర్ వర్కర్లకు కూడా ఎంతో కొంత సహాయం అందిస్తే బాగుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు