డీజే ఆడియో రిలీజ్ టీజర్ కు రంగం సిద్ధమైంది !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బన్నీ డబ్బింగ్ కూడా కానిస్తుండగా షూటింగ్ కూడా త్వరలోనే ముగుస్తుందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ చిత్రం యొక్క ఆదియి రిలీజ్ టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే నిర్మాణ సంస్థ శ్రీ వెనకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల్లో ఇప్పటి నుండే సందడి మొదలైంది. టీజర్ తోనే బ్రహ్మాండమైన స్పందన దక్కించుకున్న ఈ చిత్రం ఈ సరికొత్త ఆడియో రిలీజ్ టీజర్ తో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.