టీవీ రేటింగ్స్ లో దుమ్మురేపిన ‘దువ్వాడ జగన్నాథం’ !
Published on Oct 26, 2017 2:36 pm IST

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం థియేటర్లలోనే కాక టీవీల్లోనూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 14న జీ తెలుగు చానెల్లో ప్రసారమై 21. 2 టిఆర్ఫీ రేటింగును సొంతం చేసుకుంది. దీంతో సినిమా శాటిలైట్ హక్కులు కొన్న టీవీ ఛానెల్ కు మంచి లాభాలు దక్కినట్లైంది. సాధారణంగా హిట్ సినిమాలకు వచ్చే రేటింగ్స్ కంటే ఇది కాస్త ఎక్కువనే చెప్పాలి. దీన్నిబట్టి కుటుంబ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కున్న ఆదరణ ఏ స్థాయిదో కూడా స్పష్టమవుతోంది.

మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ కూడా జెమినీ టీవీలో 15వ తేదీన ప్రసారమై 12 రేటింగ్ తెచ్చుకుంది. అలాగే రానా, తేజాల సూపర్ హిట్ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ కూడా మా టీవీలో ప్రసారమై 11.7 రేటింగ్ సాధించగా అనుష్క, గుణశేఖర్ ల ‘రుద్రమదేవి’ ఈటీవీలో ప్రసారమై 9 రేటింగ్ సాధించింది. ఈ రేటింగ్స్ చూస్తే ఈ మధ్య సినిమాలు శాటిలైట్ రూపంలో ఎక్కువ ధరకు అమ్ముడవుతూ నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టడమే గాక కొన్న టీవీ చానెళ్లకు కూడా మంచి ఆదాయకరంగా మారాయి.

 
Like us on Facebook