యూ ఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ దాటిన DJ టిల్లు!

Published on Feb 21, 2022 11:50 am IST

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు యూఎస్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు, ఈ చిత్రం USAలో $500K కంటే ఎక్కువ వసూలు చేసింది మరియు 1 మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.

చిన్న సినిమా గా విడుదల అయిన ఈ చిత్రం ఈ తరహా వసూళ్లు సాధించి పెద్ద విజయం సాధించింది అని చెప్పాలి. DJ టిల్లు విడుదలైన మొదటి రోజు బ్రేక్ ఈవెన్ అయ్యింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో బ్రహ్మాజీ, ప్రిన్స్ సెసిల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థమన్ నేపథ్య సంగీతం అందించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ కు శ్రీచరణ్ పాకాల మరియు రామ్ మిరియాల పాటలు అందించారు.

సంబంధిత సమాచారం :