లేటెస్ట్ : ‘బుట్టబొమ్మ’ కోసం వస్తున్న డీజే టిల్లు

Published on Jan 30, 2023 10:00 pm IST

అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బుట్టబొమ్మ. మలయాళ సూపర్ హిట్ కప్పేలా కి రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ తెరకెక్కించగా సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై నిర్మించారు. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

లవ్ కమ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన బుట్ట బొమ్మ మూవీ ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 2న సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో నిర్వహించనుండగా డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ దీనికి చీఫ్ గెస్ట్ గా రానున్నారని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. గోపిసుందర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ తప్పకుండా మంచి ఆదరణ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :