ప్రస్తుతం మన దక్షిణాది నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం ఇప్పటి వరకు చాలా మేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉండగా అది కూడా మరికొన్ని రోజుల్లో మొదలయ్యి పూర్తి కానుంది.
అయితే ఈ చిత్రం షూటింగ్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో గ్యాప్ ఉంది కాబట్టి ఏదైనా అధికారిక అప్డేట్ వస్తుందేమో అని మూవీ లవర్స్ ఎదురు చూస్తుండగా అది మాత్రం ఇప్పుడప్పుడే తీరేలా లేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మళ్ళీ షూటింగ్ మొదలు కావడం అనేది చాలా పెద్ద విషయం అని అందులోనూ ఈ సమయంలో ఎవరు అప్డేట్స్ ఆశించవద్దని విశ్లేషకులు అంటున్నారు.
దాదాపు వందలాది మంది క్రూ ఈ చిత్రానికి పని చెయ్యాల్సి వస్తుంది అని ప్రతీ ఒక్కరి విషయంలో ఎంతో కేర్ తీసుకొని పని చెయ్యాల్సి వస్తుందని అందుకే ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ పునః ప్రారంభం అయ్యే వరకు ఏ అంశానికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ రాదని తెలుస్తుంది. సో మళ్ళీ RRR నుంచి ఇప్పుడప్పుడే ఒక అప్డేట్ రావడం అనేది కష్టమే అని చెప్పాలి.


