ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసిన లేటెస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “అఖండ 2” (Akhanda 2). భారీ అంచనాలు నడుమ బాలయ్య మరియు బోయపాటిలు బాక్సాఫీస్ ని తాండవం ఆడించేందుకు వచ్చేసారు. అయితే ఈ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే హంగామాతో మొదలైంది.
ఇలా థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలో ఉన్న క్రేజీ హై మూమెంట్స్ ఇంకా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లో మహా శివుని దర్శనం కూడా ఒకటి. అయితే అఖండ 2 లో శివుని పాత్రలో తెలిసిన వ్యక్తే ఉంటారు అని చాలా మంది అనుకున్నారు కానీ తీరా చూస్తే ఓ కొత్త ముఖం తెలుగు ఆడియెన్స్ కి కనిపించింది. అయితే ఇది తెలుగు ఆడియెన్స్ కి కొత్త ముఖం కావచ్చు కానీ నార్త్ ఆడియెన్స్ కి కాదట. మరి అసలు అతనెవరు?
Tarun Khanna as Lord Shiva in Akhanda – అఖండ 2 లో ప్రళయ కాల రుద్రునిగా ఈ హిందీ నటుడు..
బాలయ్య అఖండ పార్ట్ 1 లో శివతత్వాన్ని కేవలం గ్రాఫిక్స్ లో చూపిస్తేనే జనం ఊగిపోయారు. కానీ ఈసారి నేరుగా ఒక నటుణ్ణే పెట్టారు. తన నుంచి ఆ పాత్రకి కావాల్సిన ఆరా దొరకడంతో కొత్త ముఖం అయినా తెలుగు ఆడియెన్స్ యాక్సెప్ట్ చేశారు. అసలు ఆ నటుడు ఎవరంటే హిందీలో పలు సీరియల్స్ లో ఇదే శివుని పాత్రలు చేసిన నటుడు తరుణ్ ఖన్నా అట. ఈయన అఖండ 2 తో పవర్ఫుల్ రోల్ లో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు.
తరుణ్ ఖన్నా ఆన్ స్క్రీన్ కెరీర్..
హిందీలో తరుణ్ ఖన్నా ట్రాక్ రికార్డు గట్టిగానే ఉంది. తాను మొత్తం 11 సార్లు శివుని వేషం వేసారట. దాదాపు 6 ఛానెల్స్ కి పైగా పలు సీరియల్స్ లో డైరెక్ట్ రోల్ అలాగే ఇతర సీరియల్స్ లో గెస్ట్ రోల్ లాంటి వాటిలో తాను నటించారట. తాను మొదటిసారిగా 2015లో శివునిగా ‘సంతోషి మా’ అనే సీరియల్ లో నటించారు. అక్కడ నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా ఇతర సీరియల్స్ లో కొనసాగిస్తున్నారు.
బోయపాటి ప్లానింగ్ ఇదే మరి
తరుణ్ ఖన్నాది హిందీ ఆడియెన్స్ లో నోటెడ్ ఫేస్ కాబట్టి తనని ఎంపిక చేయడం బోయపాటి ప్లానింగ్ అనే చెప్పొచ్చు. పైగా సినిమాని హిందీలో ప్రత్యేకంగా ప్రమోట్ చేశారు. సో నార్త్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేందుకు చేసిన మాస్టర్ ప్లాన్ ఇదే అనుకోవాలి.
