నేడు తాజ్ డెక్కన్ లో నాగ చైతన్య ‘దోచేయ్’ సందడి

నేడు తాజ్ డెక్కన్ లో నాగ చైతన్య ‘దోచేయ్’ సందడి

Published on Apr 10, 2015 8:14 AM IST

Dochey

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య లవర్ బాయ్ ఇమేజ్ ని కాస్త పక్కన పెట్టి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘స్వామి రారా’ ఫేం సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘దోచేయ్’. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది. టీజర్ రిలీజ్ అయ్యి నాటి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు ఇప్పటికే ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నాం అనే శుభవార్తని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 3న రిలీజ్ చెయ్యాలనుకున్నారు, కానీ వాయిదా పడింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుక కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో చేయనున్నారు. స్టైలిష్ గా జరగనున్న ఈ ఆడియో వేడుకకి అక్కినేని హీరోలతో పాటు, ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. నాగ చైతన్య ఈ సినిమాలో ఓ స్టైలిష్ దొంగ పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా నాగ చైతన్యకి ఓ డిఫరెంట్ ఇమేజ్ ని ఇస్తుందని భావిస్తున్నాడు. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మధురిమ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న ఈ సినిమాకి సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు