తెలుగు బుల్లితెర పై అత్యంత ప్రజాధారణ పొందిన కామెడీ షోస్ లో ముందువరసలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ‘జబర్దస్త్’. ఎంతోమంది కమెడియన్లకు తెలుగు వెండితెరకు ప్రవేశాన్ని కల్పించిన గొప్ప టీవీ షో ఇది. మరెంతో మంది వర్ధమాన నటులకు గుర్తింపు తీసుకొచ్చిన షో కూడా ఇదే కావడం విశేషం.
కాగా తాజాగా జబర్దస్త్ నటుడు సుధాకర్ డాక్టరేట్ కూడా అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సుధాకర్‌కు తమిళ నాడులోని కోయంబత్తూర్ రాయల్ అకాడమి ఆర్ట్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. సుధాకర్ జబర్దస్త్ లోనే కాకుండా కళారంగంలో కూడా దేశవ్యాప్తంగా సుమారు 5వేల స్టేజీ ప్రదర్శనలు ఇచ్చారు. అందుకుగానూ యూనివర్సిటీ సుధాకర్ కి డాక్టరేట్ అవార్డ్ ను ప్రకటించింది. ఈ నెల 8న దుబాయ్ లో జరగబోయే ఓ ఫంక్షన్ లో సుధాకర్ ఈ డాక్టరేట్ ను అందుకోనున్నారు.
