‘భాగమతి’ ‘దుర్గావతి’గా అలరిస్తోందా ?

Published on Mar 25, 2020 1:00 am IST

స్వీటీ అనుష్క మెయిన్ రోల్ లో వచ్చిన ‘భాగమతి’ సప్సెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ రేంజ్ లో భయపెట్టింది. మొత్తానికి హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. దర్శకుడు అశోక్ ఈ సినిమాని ఓ భిన్నమైన కథాంశంతో హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కించారు. కాగా ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. హిందీలో దుర్గావతిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో , హీరోయిన్ భూమి పెడ్నేకర్ అనుష్క రోల్ చేస్తున్నారు.

కాగా విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోకే దర్శకత్వం వహిస్తున్నారు. పైగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. దాంతో హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి అనుష్క ‘భాగమతి’ ‘దుర్గావతి’గా హిందీ ప్రేక్షకులను అలరిస్తోందా చూడాలి.

సంబంధిత సమాచారం :

More