బాహుబలి మేనియాకు ట్రంప్ సైతం పడిపోయారు

Published on Feb 23, 2020 9:44 am IST

బాహుబలి మేనియా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని సైతం తాకింది. ఆయన బాహుబలి స్ఫూర్తి తో తనపై చేసిన మీమ్ ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. త్వరలో ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ట్రంప్ పర్యటనను ఉదేశిస్తూ ఓ మీమ్ చేయగా దానికి ట్రంప్ స్పందించారు. ఇండియాలోని నా ఉన్నతమైన మిత్రులను కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకొనే అమెరికా అధ్యక్షుడు సైతం బాహుబలి మీమ్ కి స్పందించడం ఆసక్తి రేపుతోంది.

అమెరికా అధ్యక్షుడు రాక కోసం మోదీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈనెల 24 మరియు 25 తేదీలలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో పాల్గొననున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో భారత్ మరియు అమెరికా మధ్య రక్షణ సహకారం, టెర్రరిజం నిర్మూలన, వాణిజ్యం వంటి విషయాలపై కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More