అలా చెబితే, అది అబద్దమే అంటున్న తమన్నా

అలా చెబితే, అది అబద్దమే అంటున్న తమన్నా

Published on Apr 16, 2015 8:29 AM IST

Tamanna
ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో గ్లామరస్ అవతారాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. కేవలం గ్లామరస్ పాత్రలతో కాకుండా అనా ప్రాధాన్యం ఉన్న పాత్రలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇది కాకుండా నాగార్జున – కార్తీలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో, రవితేజ బెంగాల్ టైగర్ లో కూడా నటిస్తోంది.

ప్రస్తుతం కెరీర్లో పీక్ స్టేజ్ లో ఉన్న తమన్నాని మీ కెరీర్ అనుకున్న ప్రణాళిక ప్రకారం సాగుతోందా అని అడిగితే ‘ప్రణాలికా.. అసలు సినిమా ఇండస్ట్రీ అనేది కళాత్మక రంగం.. ఇక్కడ ప్రణాళిక బద్దంగా పోవడానికి ఏమీ ఉండదు. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ ఎవరన్నా ప్రణాళిక బద్దంగా నా కెరీర్ సాగుతోంది అని చెబితే అది అబద్దమే తప్ప నిజం కాదు.. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. ఉదాహరణకి నా ప్రయాణం ఇలా ఉంటుదని ఊహించుకోలేదు. అందుకు ఇప్పుడు ఎంటనేదే నేను, రేపటి గురించి ఊహించలేం.. అలాగే రోజు రోజుకీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి, కావున వాళ్ళు భవిష్యత్తులో నన్ను ఎలా చూడాలనుకుంటారో కూడా తెలియదని’ అంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు