సెన్సేషనల్ హీరో తమ్ముడి సినిమా టీజర్ విడుదలకానుంది !

Published on Apr 1, 2019 5:03 pm IST

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ అనే చిత్రం తో హీరోగా పరిచయం కానున్నాడు. తాజాగా ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. ఈ చిత్రంలో ఆనంద్ కు జోడీగా జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ చిత్రం యొక్క టీజర్ తర్వలోనే విడుదలకానుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని , మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :