‘దొరసాని’’లో నిజాయితీ ఆకట్టుకుంటుంది – సుకుమార్

‘దొరసాని’’లో నిజాయితీ ఆకట్టుకుంటుంది – సుకుమార్

Published on Jul 1, 2019 11:08 PM IST

ఆనంద్ దేవరకొండ, శివాత్మకలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘దొరసాని’. జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదగా జరిగింది. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని మధురా శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్సణలో రిలీజ్ అవుతున్న దొరసాని ప్రేక్షకుల్లో, పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ 2 మిలియన్ వ్యూస్ ని దాటింది. రిలీజ్ చేసిన ‘నింగిలోన పాలపుంత, కళ్ళల్లో కలవరమై’ పాటలకు మంచి స్పందన లభించింది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని, గ్రాండ్ గా రిలీజ్ కి సిద్దం అవుతన్న ‘దొరసాని’ ట్రైలర్ లాంచ్ లో ముఖ్య అతిథులు, చిత్ర బృందం మాట్లాడుతూ:

నిర్మాత మధురశ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ : ‘ఈ సినిమా కథ ఎంత నిజాయితీగా చెప్పాడో, అంతే నిజాయితీగా దర్శకుడు మహేంద్ర సినిమా చేసాడు. కథ విన్నప్పడు కలిగిన ఫీల్ ని తెరమీదకు వందశాతం తెచ్చాడు. ఒక ఎడిటర్ నవీన్ నూలి తప్ప దాదాపుగా అందరూ కొత్త వాళ్ళతోనే ఈ సినిమాని నిర్మించాము. దొరసాని పై అన్ని వైపులా ఒక పాజిటల్ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ ట్రైలర్ ని సుకుమార్ గారితో లాంచ్ చేయించాలని అనుకున్నాను. ఆయన రావడం చాలా సంతోషంగా ఉంది. ఆనంద్, శివాత్మికలిద్దరూ చాలా బాగా చేశారు. శివాత్మిక మేకోవర్ విషయంలో జీవితగారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.’ అన్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ: ‘నిషీధి అనే షార్ట్ ఫిల్మ్ చేసి శ్యాబెనగల్ నుండి ప్రశంసలు పొందిన దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర. దర్శకుడిగా అతని అభిరుచేంటో ట్రైలర్ చెబుతుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా తీరు మారింది. నిజాయితీ నిండిన కథలే ప్రేక్షకులు మనసు గెలుచుకుంటున్నాయి. కొత్త దర్శకులు చాలా మంచి సినిమాలతో వస్తున్నారు. దొరసానిలో పాటలు రోజూ వింటున్నాను. శివాత్మక పరెఫెక్ట్ తెలంగాణ అమ్మాయిలా కనపడుతుంది. చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆమె స్ర్కీన్ ప్రజెన్స్ బాగుంది. విజయ దేవరకొండ లో కనిపించిన నిజాయితీనే వాళ్ల తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాటల్లో కూడా కనిపించింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కొరుకుంటున్నాను’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు