ప్రతి వారం బాక్స్ ఆఫీసు వద్ద ఒక్క హీరో అయినా తన సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి ట్రై చేస్తుంటారు. ఒక్కోసారి రెండు మూడు సినిమాలు కూడా వస్తుంటాయి. ఇక్కడ ఎన్ని సినిమాలు వస్తున్నాయనేది విషయం కాదు అందులో ఎన్ని ప్రేక్షకులను మెప్పిస్తున్నాయన్నదే విషయం. ప్రతి వారం లానే ఈ వారం కూడా రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు తమిళ డబ్బింగ్ సినిమాలు కావడం, అలాగే ఈ రెండిటికి స్టార్స్ ఇమేజ్ వలన క్రేజ్ కూడా ఎక్కువగా ఉండడం.
ముందుగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ మే 1న రిలీజ్ కానుంది. కమల్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. కమల్ సరసన ఆండ్రియా, పూజ కుమార్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఇది కాకుండా రాఘవ లారెన్స్ సూపర్ హిట్ సీక్వెల్ ‘గంగ’ కూడా మే 1న రిలీజ్ కానుంది. దీనికి ముందు వచ్చిన ‘కాంచన’ సినిమా సూపర్ హిట్ అవ్వడం వలన దానికి సీక్వెల్ గా వస్తున్న గంగ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాప్సీ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నిత్యా మీనన్ ఓ ముఖ్య పాత్ర చేసింది. ఈ రెండు సినిమాలు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఆడియన్స్ లో అంచనాలను పెంచుతున్నాయి.
మరి ఈ వారం తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ రెండు డబ్బింగ్ సినిమాల్లో రెండూ ప్రేక్షకులను మెప్పిస్తాయా లేక ఏదో ఒకటే ఎంటర్టైన్ చేస్తుందా అన్నది తెలియాలంటే మరొక్క రోజు వేచి చూడాల్సిందే..


