మెగాస్టార్ పుట్టిన రోజుకు డబుల్ ఫీస్ట్.?

Published on Aug 11, 2020 8:16 pm IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ అధికారికంగా ఒక్క టైటిల్ విషయంలో తప్ప మరో అంశం తెలియలేదు. దీనితో మెగా ఫ్యాన్స్ ఈ చిత్రం నుంచి ఒక్క అప్డేట్ వస్తే బాగుంటుంది అని ఎంత కాలం గానో కోరుకుంటున్నారు.

కానీ అది మాత్రం వారికి అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఒకే సారి రెండు అధికారిక అప్డేట్స్ వచ్చే గట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఆగష్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో అదే రోజున “ఆచార్య” టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ సహా చిరు చెయ్యబోతున్న మరో ప్రాజెక్ట్ వేదాళం రీమేక్ కోసం కూడా అదే రోజున అనౌన్స్మెంట్ రావడం కన్ఫామ్ అని తెలుస్తుంది. దీనితో మెగా ఫ్యాన్స్ కు డబుల్ ఫీస్ట్ ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More