బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఇంటెన్స్ సాలిడ్ స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సింగిల్ భాషలో మొదటి పార్ట్ సంచలనం సెట్ చేసింది. ఇలా పార్ట్ 1 థియేటర్స్ లో బ్లాస్ట్ తర్వాత ఓటీటీలో కూడా దుమ్ము లేపింది. అయితే ఇప్పుడు మరోసారి ఓటీటీలో పార్ట్ 1 పాన్ ఇండియా భాషలలో క్రేజీ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.
కాకపోతే ఈసారి పూర్తిగా అన్ కట్ వెర్షన్ అది కూడా రెండు ఓటీటీ లలో అందుబాటులోకి వచ్చాయి. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్, అలానే జియో హాట్ స్టార్ రెండింటిలో ధురంధర్ పార్ట్ 1 స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అది కూడా పాన్ ఇండియా భాషల్లో. సో తెలుగు ఆడియెన్స్ కూడా ధురంధర్ లోని రా వెర్షన్ ఎలాంటి కట్స్ లేకుండా చూడాలి అనుకుంటే వీటిలో చూడొచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
