నటుడిగా 47 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్ !

Published on Nov 22, 2021 4:00 pm IST

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నేటితో నటుడిగా 47 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. నవంబర్ 22, 1975న విడుదలైన ‘స్వర్గం నరకం’ నేటితో 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. దివంగత దాసరి నారాయణరావు మోహన్ బాబుకు మొదటి అవకాశం ఇచ్చి.. నటుడిగా నిలబడేందుకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అయితే దాసరి గారి దర్శకత్వం వహించిన ఈ ‘స్వర్గం నరకం’ సినిమా మోహన్ బాబు కెరీర్ లో మరపురాని చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది.

ఈ సినిమా బాలీవుడ్‌లో ‘స్వర్గ నరక్‌’ పేరుతోనూ, తమిళంలో ‘సొర్గం నరగం’ పేరుతో రీమేక్ అయి మంచి విజయం సాధించింది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తాజా సినిమా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. అలాగే ఆహా వారు తాజాగా మోహన్ బాబుతో మరో టాక్‌ షోను కూడా ప్లాన్ చేస్తున్నారని, పైగా ఆ షోలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. ఇప్పటికి అయితే అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :