సోషల్ మీడియాకి బ్రేక్.. ‘డ్రాగన్’ బ్యూటీ సడెన్ నిర్ణయం!

సోషల్ మీడియాకి బ్రేక్.. ‘డ్రాగన్’ బ్యూటీ సడెన్ నిర్ణయం!

Published on Jun 20, 2026 2:10 PM IST

Kayadu-Lohar

తన కెరీర్ ఆరంభంలోనే మంచి గుర్తింపును అందుకున్న యంగ్ హీరోయిన్స్ లో కోలీవుడ్ డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కూడా ఒకామె. అయితే కయాదు ఇప్పుడు తమిళ్ సహా తెలుగు మలయాళ సినిమాల్లో కూడా బిజీగా వుంది. ఇటీవల ‘పళ్ళి చట్టంబి’లో పలకరించిన బ్యూటీ సడెన్ గా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక నుంచి కొన్నాళ్ల పాటుగా తను సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టు తెలిపింది.

”సోషల్ మీడియా నుండి ఒక చిన్న అడుగు వెనక్కి వేస్తున్నాను. కొన్నిసార్లు, మన శరీరాలకు మనం ఇచ్చే విశ్రాంతి ఇచ్చేలానే మనస్సుకు కూడా విశ్రాంతి అవసరం. నేను వేగాన్ని తగ్గించుకోవాలని, కొంతకాలం డిస్ కనెక్ట్ అయ్యి స్క్రీన్ దాటి తనతో తను ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నాను. తనకు ఇప్పటివరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ త్వరలో కలుద్దాం” అని ముగించింది. సో కొన్నాళ్ల పాటు ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో ఉండదని చెప్పాలి. ప్రస్తుతం అయితే తెలుగులో నాచురల్ స్టార్ నానితో ది ప్యారడైజ్ అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by kayadulohar (@kayadu_lohar_official)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు