మాలీవుడ్ లో దృశ్యం2 హవా..!

Published on Jul 2, 2021 10:32 pm IST


దృశ్యం చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వచ్చింది. అయితే కేవలం ఒక బాషలో మాత్రమే కాకుండా చాలా భాషల్లోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే దృశ్యం కి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం లో మీనా మోహన్ లాల్ కి భార్య గా నటించారు. అయితే ఈ చిత్రం కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఉన్న సమయం లో భారీ గా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం డైరెక్ట్ ఓటిటి గా విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఆన్లైన్ వేదిక గా విడుదల అయి ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఆంటోనీ పెరుంబవూర్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో లు నిర్మాతలు గా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం :