మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. అందుకు కారణం.. మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం 3’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మోహన్ లాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ.. ‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. వేచి చూస్తూ ఉంటుంది. జార్జ్ కుట్టి మే 21, 2026న వస్తున్నాడు’ అని పోస్ట్ పెట్టారు.
కాగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ – మోహన్ లాల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు దృశ్యం మూడో భాగం అలరించేందుకు రెడీ అవుతుంది. మరోవైపు హిందీ ‘దృశ్యం3’ కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. అజయ్ దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నారు.


