తెలుగు సినీ ఇండస్ట్రీలో గతకొంత కాలంగా డ్రగ్స్ భూతం తన పంజా విసురుతోంది. ఇప్పటికే ఈ మత్తు పదార్థాల కేసులో పలువురు పోలీసుల విచారణను కూడా ఎదుర్కొన్నారు. అయితే, తాజాగా మరోసారి టాలీవుడ్‌లో గంజాయి కలకలం రేపింది.
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో పాపులర్ అయిన ఫోక్ సింగర్ మంగ్లీ తాజాగా చేవెళ్లలోని ఓ రిసార్ట్‌లో తన బర్త్ డే పార్టీని ఇచ్చింది. ఈ పార్టీకి సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ పార్టీలో గంజాయి, విదేశీ మద్యం లభ్యమైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ ఎస్ఓటీ పోలీసులు రిసార్టుపై దాడి చేయగా, పలువురు గంజాయి తీసుకున్నట్లు తేలింది.
దీంతో వారికి పరీక్షలు చేయగా గంజాయి తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు సింగర్ మంగ్లీ, పార్టీ నిర్వాహకుడు, రిసార్ట్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడతాయి అనేది వేచి చూడాలి.


