ఇప్పుడు సంక్రాంతి సినిమా హడావుడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా సినీ ప్రేమికులు థియేటర్స్ కు తరలి వస్తూ ఉంటే సినీ పరిశ్రమకు కొండంత అండ దొరికింది. మరి ఈ సమయంలోనే విడుదలకు చాలానే సినిమాలు సన్నద్ధం అయ్యాయి.
అలా లేటెస్ట్ గా సడెన్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నభా నటేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని మేకర్స్ సంక్రాంతి బరిలో కన్ఫర్మ్ చేశారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఒక స్పెషల్ ప్లాన్ ను గీసాడు.
ఇప్పటికే విడుదల చేసిన హోలా చికా పాటతో కలిపి మొత్తం ఐదు పాటలను ట్యూన్ చేసిన దేవి వాటని కలిపి ఈ చిత్రానికి ఒక మ్యూజికల్ వీక్ గా ప్రమోట్ చెయ్యాలని ప్లాన్ చేసాడు. ఈరోజు రెండో పాట “పడిపోయా” లిరికల్ సాంగ్ రిలీజ్ తో ఈ వారం అంత ఒక్కో పాటను విడుదల చేస్తూ తన పాటలతో మోత మోగించనున్నాడు.
ఈరోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల కానున్న ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ ఒక సూపర్బ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటించగా సోనూ సూద్ కూడా ఒక కీ రోల్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ చిత్రాన్ని ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మాణం వహించారు.


