బన్నీ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్!
Published on Nov 6, 2016 11:55 am IST

dj-in
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో ‘డీజే- దువ్వాడ జగన్నాథం’ పేరుతో ఓ సినిమా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‍లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమా సెట్స్‌కు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సరదాగా విచ్చేసి టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. హరీష్ శంకర్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ దేవిశ్రీ రాకతో సెట్స్‌లో కొత్త ఎనర్జీ వచ్చిందని అన్నారు.

ఇక ఈ సందర్భంగానే అప్పుడే షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను చూసి దేవిశ్రీ మరింత ఉత్సాహానిచ్చే మాటలు చెప్పారట. అల్లు అర్జున్- దేవిశ్రీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ఆడియోలకు ఏమాత్రం తగ్గకుండా డీజే సినిమా ఆడియో ఉంటుందని తెలుస్తోంది. హరీష్ శంకర్ స్టైల్లోనే యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న ‘డీజే’కు అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా దిల్‌రాజు టీమ్ ప్లాన్ చేసింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook